3 సూపర్ ఓవర్లతో రికార్డు
18-06-2025 08:22:37
2: SPORTS
OFM
, Publish Date - Jun 18 , 2025 | 05:43 AM
క్రికెట్ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి...
నేపాల్-నెదర్లాండ్స్ టీ20 మ్యాచ్
గ్లాస్గో: క్రికెట్ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ కూడా టై అయ్యింది. అయితే ఇక్కడ ఫలితం తేలేందుకు ఒక్క సూపర్ ఓవర్ సరిపోలేదు. ఏకంగా మూడుసార్లు ఇరు జట్లు బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటి వరకు టీ20 లేక లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ముందుగా నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. ఛేదనలో నేపాల్ చివరి ఓవర్‌లో రెండు ఫోర్లతో సరిగ్గా 152/8 స్కోరే చేసింది. దీనికి తోడు రెండు జట్లు కూడా తొలి సూపర్ ఓవర్‌లో 19, రెండో సూపర్ ఓవర్‌లో 17 పరుగులు సాధించడంతో మూడోసారి అనివార్యమైంది. అందులో నేపాల్ పరుగులేమీ చేయకుండా 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా.. నెదర్లాండ్స్ ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ను విజయంతో ముగించింది.
ఇవీ చదవండి:
గిల్-పంత్‌తో కోహ్లీ మీటింగ్
బుమ్రా సంచలన వ్యాఖ్యలు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి