ఫైనల్స్‌లో 14 మంది బాక్సర్లు
28-04-2025 08:20:53
2: SPORTS
OFM
, Publish Date - Apr 28 , 2025 | 02:39 AM
ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్సలో 14 మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకొన్నారు...
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్సలో 14 మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకొన్నారు. అండర్-15 సెమీ్‌సలో కోమల్ (30-39 కిలోలు), నవ్య (58 కి), సునయన (61 కి), కుషీ అహ్లావత్ (35 కి), తమన్నా (37 కి), ప్రిన్సి (52 కి), తృష్ణ (67 కి), మిల్కీ (43 కి) విజయాలు సాధించారు. కాగా, స్వీ (40 కి), వన్సిక (70+ కి)కు బై లభించింది. బాలుర లో వినోద్ (35 కి), రుద్రాక్ష్ (46 కి), అభిజిత్ (61 కి), లక్ష్య ఫొగట్ (64 కి) స్వర్ణ పోరుకు చేరుకొన్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..