2: SPORTS
OFM
, Publish Date - Apr 28 , 2025 | 02:43 AM
సుదీర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన తమ ఆరంభ మ్యాచ్ లో భారత్ 1-4తో డెన్మార్క్ చేతిలో చిత్తయింది. సింగిల్స్ టాప్ స్టార్లు సింధు, ప్రణయ్ కూడా...
డెన్మార్క్ 4-1తో భారత్‌పై గెలుపు
సుదీర్మన్ కప్ బ్యాడ్మింటన్
గ్జియామెన్ (చైనా): సుదీర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన తమ ఆరంభ మ్యాచ్ లో భారత్ 1-4తో డెన్మార్క్ చేతిలో చిత్తయింది. సింగిల్స్ టాప్ స్టార్లు సింధు, ప్రణయ్ కూడా ఓడడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. మహిళల డబుల్స్‌లో తనీసా క్రాస్టో/శ్రుతి మిశ్రా జోడీ మాత్రం ప్రత్యర్థిపై నెగ్గి కాస్త పరువైనా నిలబెట్టింది. మరోవైపు తమ టాప్ షట్లర్లు అక్సెల్సెన్, మియా బ్లిచ్‌ఫీల్డ్ లేకుండానే పోటీపడ్ద డెన్మార్క్ పూర్తిస్థాయిలో సత్తాచాటింది. మొదట మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ద్వయం తనీషా/ధ్రువ్ కపిల 13-21, 14-21తో ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీ జెస్పర్ టాఫ్/అమేలీ మెగ్‌లాండ్ చేతిలో, పురుషుల సింగిల్స్‌లో వెటరన్ ప్రణయ్ 15-21, 16-21తో ఆంటోన్సెన్ చేతిలో, ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో హరిహరన్/రూబన్ జంట 7-21, 4-21తో ప్రపంచ నెం.1 జోడీ కిమ్ ఆస్ట్ర్‌ప/ఆండెర్స్ స్కారప్ చేతిలో ఓడడంతోనే డెన్మార్క్ 3-0 ఆధిక్యంతో భారత్‌పై పైచేయి సాధించింది. ఇక నామమాత్రమైన మహిళల సింగిల్స్‌లో లినె హాజ్‌మార్క్ 22-20, 23-21తో సింధుకు షాకివ్వడంతో డెన్మార్క్ 4-0తో పూర్తి ఆధిపత్యం చాటుకుంది. ఆఖరిదైన మహిళల డబుల్స్‌లో భారత జంట తనీషా/శ్రుతి 21-13, 21-18తో నటాషా/బోజెను ఓడించింది. భారత్ తర్వాతి పోరును ఇండోనేసియాతో మంగళవారం ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..