అభివృద్ధికి నోచుకోని అల్లూరి పార్కు
28-04-2025 08:16:01
2: ANDHRA-PRADESH

OFM , Publish Date - Apr 28 , 2025 | 12:40 AM

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు పార్కు ఆరేళ్ల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులు తప్ప.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు అల్లూరి పార్కు అభివృద్ధికి రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు అప్పటి మంత్రులు ప్రకటించారు. కానీ ఒక్క రూపాయ కూడా విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఏడాడి జూలై నాలుగో తేదీన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎంపీ నిధులు రూ.50 లక్షలతో పార్కులో అభివృద్ధి పనులు చేస్తామని ప్రకటించారు.

హామీలకే పరిమితమవుతున్న పాలకుల హామీలు

రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వైసీపీ హయాంలో మంత్రుల ప్రకటన

ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయని వైనం

రూ.50 లక్షల ఎంపీ నిధులతో అభివృద్ధి చేస్తామన్న కూటమి నేతలు

తొమ్మిది నెలలైనా అతీగతీలేదు

కృష్ణాదేవిపేట, ఏప్రిల్‌ 27 (OFM): గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు పార్కు ఆరేళ్ల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులు తప్ప.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు అల్లూరి పార్కు అభివృద్ధికి రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు అప్పటి మంత్రులు ప్రకటించారు. కానీ ఒక్క రూపాయ కూడా విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఏడాడి జూలై నాలుగో తేదీన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎంపీ నిధులు రూ.50 లక్షలతో పార్కులో అభివృద్ధి పనులు చేస్తామని ప్రకటించారు. పార్కులో సభావేదిక నిర్మాణం, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, ఇతర మరమ్మతు పనులు చేయిస్తామని చెప్పారు. ఇది జరిగి తొమ్మిది నెలలు కావస్తున్నది. ఇంతరకు పనులు చేపట్టలేదు. పార్కులో పర్యాటకులు సేద తీరే నాలుగు పగోడాలు పూర్తిగా శిథిలమై అధ్వానంగా వున్నాయి. నడక మార్గంలో పలుచోట్ల టైల్స్‌ లేచిపోయాయి. అల్లూరి, గంటందొర సమాధులున్న మందిరం శ్లాబ్‌ నుంచి తరచూ పెచ్చులు ఊడిపడుతున్నాయి. పార్కు ప్రహరీగోడ పలుచోట్ల దెబ్బతిన్నది. మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు వర్ధంతి. కృష్ణాదేవిపేటలో అల్లూరి పార్కు అభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని స్థానికులు, అల్లూరి అభిమానులు, పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

**** ONGOLE FIRST MEDIA ****