2: ANDHRA-PRADESH
OFM
, Publish Date - Apr 28 , 2025 | 12:41 AM
ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని వివిఽ ద విభాగాల వైద్యులకు పదోన్నతులు లభించాయి. వివిధ జిల్లాల్లోని కాలేజీలకు ప్రిన్సి పాల్స్‌గా, ఆస్పత్రులకు సూపరింటెండెంట్లుగా నియమించారు. వీరిలో గైనకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కేవీఎస్‌ఎం సంధ్యాదేవిని ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
పలువురికి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్స్
ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా సంధ్యాదేవికి పూర్తి బాధ్యతలు
భర్తీకాని కేజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టు
విశాఖపట్నం, ఏప్రిల్ 27 (OFM):
ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని వివిఽ ద విభాగాల వైద్యులకు పదోన్నతులు లభించాయి. వివిధ జిల్లాల్లోని కాలేజీలకు ప్రిన్సి పాల్స్‌గా, ఆస్పత్రులకు సూపరింటెండెంట్లుగా నియమించారు. వీరిలో గైనకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కేవీఎస్‌ఎం సంధ్యాదేవిని ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన బుచ్చిరాజు గత నెలలో పదవీ విరమణ చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా సంధ్యాదేవి వ్యవహరిస్తున్నారు. ఆమెకే పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిం చారు. ఎండో క్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ కేఏవీ సుబ్రహ్మణ్యంను ఒంగోలులోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమించారు. గైనకాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ సి.అమూల్యను శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా నియమించారు. జనరల్ సర్జరీ విభాగాని కి చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వి.మన్మథరావును మచిలీపట్నం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియ మించారు వీరిలో ఇద్దరు వైద్యులు ఆయా పోస్టుల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదని సమాచారం.
కేజీహెచ్‌పై సందిగ్ధం
కాగా కేజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టు ను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఇన్‌చార్జిగా డాక్టర్ శివానంద వ్యవహరిస్తున్నా రు. తాజాగా పదోన్నతులు పొందిన ఇద్దరితో పాటు మరో ఇద్దరు సీనియర్ వైద్యులు ఈ పోస్టు కోసం ప్రయత్నాలు సాగించారు. అయితే వారికి మరో చోట అవకాశాలు లభించాయి.