2: ANDHRA-PRADESH
OFM
, Publish Date - Apr 28 , 2025 | 12:46 AM
తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ డి.అనురాధ (నర్సీపట్నం) ఆదివారం ఎలమంచిలి పట్టణంలో చికెన్, మటన్, చేపలు, కూరగాయలు విక్రయించే దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. తమ వెంట తెచ్చుకున్న తూనిక రాళ్లను ఎలక్ర్టానిక్ కాటాపై వుంచి పరిశీలించారు. కిలోకు 100 గ్రాములు తక్కువ వున్నట్టు గురించారు.
కిలోకు వంద గ్రాములు తక్కువ వచ్చేలా కాటాల్లో సెట్టింగ్
తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ తనిఖీల్లో బయటపడిన అక్రమాలు
తొమ్మిది దుకాణాలపై కేసులు
ఎలక్ర్టానిక్ కాటాలు సీజ్
ఎలమంచిలి, ఏప్రిల్ 27 (ఆంరఽధజ్యోతి): తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ డి.అనురాధ (నర్సీపట్నం) ఆదివారం ఎలమంచిలి పట్టణంలో చికెన్, మటన్, చేపలు, కూరగాయలు విక్రయించే దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. తమ వెంట తెచ్చుకున్న తూనిక రాళ్లను ఎలక్ర్టానిక్ కాటాపై వుంచి పరిశీలించారు. కిలోకు 100 గ్రాములు తక్కువ వున్నట్టు గురించారు. ఈ మేరకు ఎలక్ర్టానిక్ కాటాలో పది శాతం తక్కువ తూకం వచ్చేలో సెట్టింగ్ చేయించుకున్నట్టు నిర్ధారించారు. చేపలు, మటన్ విక్రయిస్తున్న ఆరుగురితోపాటు ఇతర వ్యాపారాలకు చెందిన ముగ్గురు కలిపి మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేసినట్టు అనురాధ తెలిపారు. ఎలక్ర్టానిక్ కాటాలను సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. ఈ దాడులలో సిబ్బంది ఏ.రుషికేశ్, బి.వెంకటరెడ్డి, ప్రకాశ్ పాల్గొన్నారు.