2: ANDHRA-PRADESH
OFM
, Publish Date - Apr 28 , 2025 | 12:48 AM
జీవీఎంసీ నూతన మేయర్ ఎన్నిక సోమవారం జరగనున్నది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలోని 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫిషీయో సభ్యుల హోదాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందజేశారు.
ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనమే
అనంతరం బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం, ఏప్రిల్ 27 (OFM):
జీవీఎంసీ నూతన మేయర్ ఎన్నిక సోమవారం జరగనున్నది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలోని 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫిషీయో సభ్యుల హోదాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందజేశారు.
పీలా ఎన్నిక లాంఛనమే...
జీవీఎంసీ మేయర్‌గా 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పేరు ఖరారయింది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆదివారం బీఫాం అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు జవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరుని ఒక కార్పొరేటర్ ప్రతిపాదిస్తారు. దానిని కూటమి భాగస్వామ్యపార్టీకి చెందిన మరో కార్పొరేటర్ బలపరుస్తారు. దీనిపై ఎన్నికల అధికారి హోదాలో జేసీ మయూర్ అశోక్ ఓటింగ్ నిర్వహిస్తారు. జీవీఎంసీలో కూటమికి 63 మంది కార్పొరేటర్లతో పాటు 11 మంది ఎక్స్ అఫీషియోసభ్యుల బలం ఉంది. మేయర్ ఎన్నికకు జీవీఎంసీ మొత్తం సభ్యుల్లో సగం మంది మద్దతు ఉంటే సరిపోతుంది ఈ నేపథ్యంలో పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనమే. మేయర్‌గా ఎన్నికైన వెంటనే పీలా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించేందుకు నిర్ణయించుకోవడంతో అతని ప్రమాణ స్వీకారానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇదిలావుండగా మేయర్ ఎన్నిక ప్రక్రియను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ కార్పొరేటర్లు ప్రకటించారు.
విశాఖ అభివృద్ధి కోసమే మేయరు మార్పు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ
విశాఖపట్నం, ఏప్రిల్ 27 (OFM):
విశాఖ నగర అభివృద్ధి కోసమే జీవీఎంసీ మేయరును మార్చుతున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు మేయరు అభ్యర్థిగా ఎంపికైన పీలా శ్రీనివాసరావుకు ఆదివారం పార్టీ కార్యాలయంలో బీఫాం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అథోగతిపాలైతే జీవీఎంసీలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి పాలనలో విశాఖను మరింత అభివృద్ధి చేయాలనే దృక్పథంతో మేయరును మార్చాలని నిర్ణయించామన్నారు. బీఫాంతోపాటు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి అందజేయాల్సిన ఫాం-ఎ కూడా పీలాకు అందజేశారు. ఉదయం తొమ్మిది గంటలకు జీవీఎంసీలో కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియోసభ్యులు సమావేశమై మేయరు అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఎన్నుకుంటారన్నారు. ఆ తరువాత ప్రిసైడింగ్ అఽధికారి మేయరు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించి, నామినేషన్లు స్వీకరించిన అనంతరం ఎన్నిక నిర్వహిస్తారన్నారు.